
Allu Arjun: పుష్ప 2 సెట్స్‌లో సుకుమార్, అల్లు అర్జున్ పిక్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2024 స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకి టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈరోజు సుకుమార్ పుట్టినరోజు కావడంతో పలువురు సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లు అర్జున్ కూడా సుకుమార్ కి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు.
అంతేకాకుండా పుష్ప2 సెట్స్ నుండి ఓ స్టిల్‌ను కూడాషేర్ చేశాడు.ఈ పిక్ లో అల్లు అర్జున్ , సుకుమార్ తో ఏదో చర్చిచిస్తునట్లు కనిపించారు.
ఈ చిత్రం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో ఫహద్ ఫాసిల్,జగదీష్,అనసూయ భరద్వాజ్,సునీల్,అజయ్ తదితరులు నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్
Happy Birthday to My Genius Sukku Darling #Sukumar pic.twitter.com/ni8c0vu8OZ
— Allu Arjun (@alluarjun) January 11, 2024