NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Emotional farewell: రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు .. పాడె మోసిన చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    Emotional farewell: రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు .. పాడె మోసిన చంద్రబాబు 
    రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు .. పాడె మోసిన చంద్రబాబు

    Emotional farewell: రామోజీరావుకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా వీడ్కోలు .. పాడె మోసిన చంద్రబాబు 

    వ్రాసిన వారు Stalin
    Jun 09, 2024
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మీడియా అధినేత, రామోజీ గ్రూప్‌ చైర్మన్‌ రామోజీరావు శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 87.

    ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

    ఆయన కుమారుడు కిరణ్ అంత్యక్రియల చితికి నిప్పంటించారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆది, సోమవారాలను సంతాప దినాలుగా ప్రకటించింది, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను సగానికి ఎగుర వేశారు.

    అంత్యక్రియలు 

    జర్నలిజం పట్ల రామోజీరావుకు ఉన్న నిబద్ధతను కొనియాడిన రేవంత్ 

    రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింద. ఆయన మరణం తరువాత, పార్థీవ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు.

    హైదరాబాద్‌లో చిత్రనిర్మాత ఎస్‌ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వంటి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

    రామోజీరావు మృతికి సంతాపంగా శనివారం తమ సినీ షూటింగ్ షెడ్యూల్‌లను నిలిపేశారు.

    కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి జర్నలిజం పట్ల రామోజీరావుకు ఉన్న నిబద్ధతను కొనియాడారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Watch: అంత్యక్రియలకు హాజరైన  చంద్రబాబు నాయుడు 

    #WATCH | Telangana: TDP chief N Chandrababu Naidu attends the last rites of Eenadu & Ramoji Film City founder Ramoji Rao, in Hyderabad.

    (Visuals source: I&PR, Government of Telangana) pic.twitter.com/x6JHDkJNaB

    — ANI (@ANI) June 9, 2024

    వారసత్వం 

    రామోజీ రావు వారసత్వం: వార్తలు,వినోద పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు 

    ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్, ఉషా కిరణ్ మూవీస్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, మార్గదర్శి చిట్ ఫండ్ ,డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు కార్యదీక్షతో ముందుకు నడిపి ఘనమైన శక్తిగా నిలిచారు.

    ఆయన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

    రామోజీ రావు వార్తలు , వినోద పరిశ్రమను మార్చిన దార్శనికుడు. ఆయన కలల సౌదం రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఉంది.

    ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గుర్తింపు పొందింది.

    నివాళులు 

    రామోజీరావు మృతి పట్ల సినీ, మీడియా పరిశ్రమలు సంతాపం వ్యక్తం చేశాయి 

    ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రజనీకాంత్ ఆయనని తన గురువు, శ్రేయోభిలాషిగా గుర్తుచేసుకున్నారు.

    అయితే చిరంజీవి ఆయన "ఎవరికీ తలవంచని పర్వతం" అని పేర్కొన్నారు.

    అల్లు అర్జున్ ఆయన "మార్గదర్శి స్ఫూర్తిదాయకమైన దూరదృష్టిని " అని కొనియాడారు .

    ఈనాడుతో ప్రాంతీయ మీడియాను మార్చినఘనత ఆయనదేనని రామ్ చరణ్ ప్రశంసించారు.

    భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో రామోజీ రావును సత్కరించాలని చిత్ర నిర్మాత రాజమౌళి సూచించారు.

    స్మరణ

    రామోజీరావు సేవలను స్మరించుకున్న కేరళ ముఖ్యమంత్రి

    రామోజీరావు చేసిన సేవలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్మరించుకున్నారు.ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

    సినిమా , మీడియా పరిశ్రమలలో ఆయన ఒక విజన్ అని కొనియాడారు.

    కేరళ సంక్షోభ సమయంలో రామోజీ రావు చాలాఅండగా నిలిచారన్నారు. ముఖ్యంగా వరదల అనంతర పునర్నిర్మాణ ప్రయత్నాలకు సహకరించారని విజయన్ గుర్తు చేసుకున్నారు.

    ఆయన మరణం పరిశ్రమలో ఒక శూన్యతను మిగిల్చింది.

    అది పూరించడానికి కష్టంగా ఉంటుందన్నారు. ఇది భారతీయ మీడియా సినిమాలకు మార్గదర్శక రచనల శకానికి ముగింపు పలికింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్

    హైదరాబాద్

    Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి  తాజా వార్తలు
    ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య ఆస్ట్రేలియా
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం
    Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. !  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025