తదుపరి వార్తా కథనం

Ramoji Rao: తెలుగు జర్నలిజాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన రామోజీరావు కన్నుమూత
వ్రాసిన వారు
Stalin
Jun 08, 2024
09:36 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు జర్నలిజాన్ని సామాన్య ప్రజలకు సరళమైన భాషలో అందించిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు.
ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Details
పెదపారుపూడిలో జననం, బహుముఖ ప్రజ్ఞాశాలి
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో 'ఈనాడు'ను ప్రారంభించారు.
మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. చైతన్యదీప్తుల్లాంటి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు.
ఆయన పేరుతోనే రామోజీ ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు
మీరు పూర్తి చేశారు