Page Loader
Mohanlal : ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Mohanlal : ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించిన 'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2: Empuraan) చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల 24వ తేదీ నుంచి జియోహాట్‌స్టార్‌ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్‌ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించగా, ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ఈ సినిమాను రూపొందించారు. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అప్పటి నుంచే భారీ ఆదరణను పొందుతోంది.

వివరాలు 

ఐదు రోజుల్లోనే  రూ.200 కోట్ల వసూళ్లు 

అంతకముందు వచ్చిన హిట్‌ సినిమా 'లూసిఫర్‌'కు కొనసాగింపుగా రూపొందించిన ఈ సీక్వెల్‌ 'ఎల్‌ 2: ఎంపురాన్‌', విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలను నెలకొల్పింది. విడుదలైన నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన మలయాళ సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసి, మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

వివరాలు 

రీ సెన్సార్‌ అనంతరం కొన్ని మార్పులు

ఈ సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఉండటంతో, రాజకీయంగా కూడా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా, సినిమాకు వచ్చిన స్పందన, కలెక్షన్లు మాత్రం చెక్కుచెదరలేదు. ఆవేశపూరితమైన సన్నివేశాల కారణంగా రీ సెన్సార్‌ ప్రక్రియకు లోనై, కొన్ని మార్పులను చిత్రబృందం చేయాల్సి వచ్చింది.