LOADING...
Pawan Kalyan: వాయిదాలకు ఎండ్ కార్డు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఖరారు!
వాయిదాలకు ఎండ్ కార్డు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఖరారు!

Pawan Kalyan: వాయిదాలకు ఎండ్ కార్డు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఖరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' విడుదలపై స్పష్టత వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇది మొదట జూన్ 12న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో విడుదలను వాయిదా వేసింది. తాజా సమాచారం మేరకు ఈసారి విడుదలపై ఎలాంటి మార్పులుండకపోవచ్చని, నిర్మాత ఏఎమ్ రత్నం తుదితీర్మానం తీసుకున్నారని తెలుస్తోంది.

Details

జూన్ 26న రిలీజ్

ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటుడు సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇదే కాకుండా, ఇది దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ సినిమా కావడంతో, ఆయన అభిమానుల్లో ఈ చిత్రంపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. 'హరిహర వీరమల్లు' ఒక పౌరాణికత, చారిత్రకత మేళవించిన కథనంతో తెరకెక్కిన మూవీ కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా జూన్ 26న థియేటర్లలోకి రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.