Page Loader
Isha Koppikar : 14 ఏళ్ల బంధానికి స్వస్తి.. విడాకులు తీసుకున్న నాగర్జున హీరోయిన్!
14 ఏళ్ల బంధానికి స్వస్తి.. విడాకులు తీసుకున్న నాగర్జున హీరోయిన్!

Isha Koppikar : 14 ఏళ్ల బంధానికి స్వస్తి.. విడాకులు తీసుకున్న నాగర్జున హీరోయిన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. నటి ఇషా కొప్పికర్(Isha Koppikar) భర్త టిమ్మి నారంగ్‌తో విడిపోతున్నట్లు తెలిసింది. తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి వారిద్దరూ పుల్ స్టాప్ పెట్టినట్లు సమాచారం. వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ సినిమాలో 'ఎక్కడికి నీ పరుగు' అనే పాటను ఇప్పటికీ చాలామంది మర్చిపోరు. ఈ పాటలో నటి ఇషా కొప్పికర్ నటించింది. తర్వాత 1998లో 'చంద్రలేఖ' సినిమాతో పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ సినిమాల్లో నటించిన ఈ నటి తాజాగా విడాకుల వార్తతో తెరపైకి వచ్చింది. 2009లో ప్రముఖ వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ ను ఇషా ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Details

చెప్పడానికి ఏమీలేదన్న ఇషా కొప్పికర్

అయితే మనస్పర్థల కారణంగా కారణంగా భర్త నుండి విడిపోతున్నట్లు తెలిసింది. ఈ కారణంగా ఇషా తన కూతురిని తీసుకొని కొంతకాలం క్రితమే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసిందట. ఇషా, టిమ్మీ పెళ్లి 2009 నవంబర్‌లో జరిగింది. వీరికి 2014లో రియానా అనే కూతురు జన్మించింది. దీనిపై ఇషాను ప్రశ్నించగా, తాను చెప్పడానికి ఏమీ లేదని, ఇప్పుడేమీ తాను మాట్లాడదల్చుకోలేదని, తనకు కొంచెం ప్రైవసీ కావాలని పేర్కొంది. ప్రస్తుతం ఆమె నటించిన 'అయాలన్‌' అనే తమిళ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.