
Agent : సినిమా భారీ ప్లాప్ అయినా.. రెమ్యునరేషన్ తీసుకోని హీరో ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో హీరోలు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారికి పెద్దగా తేడా ఉండదు. కానీ ఒక హీరో మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రవర్తించాడు. తన సినిమా విఫలం కావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత అనిల్ సుంకర స్వయంగా వెల్లడించారు. అనిల్ సుంకర నిర్మాణంలో, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2023 ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చిన 'ఏజెంట్' సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఘోరంగా ఫ్లాప్ కావడంతో నిర్మాతకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి.
Details
ఇటీవలే వివాహం చేసుకున్న అఖిల్
ఈ నేపథ్యంలో హీరో అఖిల్ తన రెమ్యునరేషన్ పూర్తిగా వదులుకున్నాడని నిర్మాత తెలిపారు. సినిమా సక్సెస్ అయితేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని ముందే అఖిల్ చెప్పాడని, సినిమా ఆడకపోవడంతో తానే స్వయంగా వదులుకున్నాడని చెప్పారు. 'అఖిల్‌కు రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటే నేను ఇంకా నష్టపోయేవాడిని. ఆ విషయంలో అతనికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి' అని అనిల్ సుంకర స్పష్టం చేశారు. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో, ఇటీవలే తన ప్రేమికురాలు జైనబ్‌ను అఖిల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.