
Akanda 2 : అఖండ 2 విడుదలపై ఉత్కంఠ.. సంక్రాంతి కంటే ముందుగానే ప్లాన్?
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ 2' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
గతంలో విడుదలైన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో కథ 'అఖండ' మొదటి భాగానికి కొనసాగింపుగా సాగనుందని సమాచారం.
అంతేకాక మొదటి భాగంలో కనిపించిన కొన్ని పాత్రలు ఈ చిత్రంలో మళ్లీ కనిపించనున్నాయి. బాలకృష్ణ ఈ సారి కూడా రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నారన్నది విశేషం.
Details
షూటింగ్ ఆలస్యం
అఖండ 2 షూటింగ్ కొంత ముందుగానే మొదలైంది. కానీ బాలకృష్ణ రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో, చిత్రీకరణ పదేపదే వాయిదా పడింది. అయినా తాజా సమాచారం మేరకు సినిమా చివరి దశకి చేరుకుంది.
విడుదలకు మాత్రం ఆటంకాలు
మూవీని తొలుత దసరా కానుకగా విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన. కానీ విఎఫ్‌ఎక్స్ (VFX) పనులకు ఎక్కువ సమయం పడుతుండటంతో, ఈ గడువుకు చేరుకోవడం సాధ్యపడట్లేదని సమాచారం.
ఇంతకు ముందు ఈచిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారని వార్తలొచ్చాయి.
కానీ అప్పటికే చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా సహా పలు భారీ సినిమాలు బరిలో ఉండటంతో, పోటీ తప్పించేందుకు ముందుగానే విడుదల చేసే దిశగా మేకర్స్ యోచిస్తున్నారట.