Page Loader
Mamata Mohan Das: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి
మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి

Mamata Mohan Das: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు కథనం.. చీప్ రాతలు రాస్తారంటూ ఫైర్ అయిన నటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2023
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోహీరోయిన్ల సంబంధించిన ఆసత్య వార్తలు ఈ మధ్య నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. సెలబ్రేటీల వ్యక్తిగత విషయాల గురించి రోజు రోజుకూ ఎన్నో ఫేక్ కథనాలు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇలాంటి తప్పుడు న్యూస్‌తో చాలామంది సెలబ్రిటీలు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. తాజాగా రష్మిక మందన్న, కత్రినాకైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు డీప్‌ఫేక్ భారీనపడ్డారు. ప్రస్తుతం కోలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి రాసిన ఓ తప్పుడు కథనం ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. తాను మరణానికి లొంగిపోతున్నానని, ఇక బతకలేనని, మమతా మోహన్ దాస్ జీవితం దుర్భర స్థితిలో ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలయ్యింది.

Details

ఫేక్ ఆకౌంట్లను ఎంకేరేజ్ చేయోద్దన్న మమతా మోహన్ దాస్

గీతూ నాయర్ అనే ఫేక్ ఫ్రోఫైల్‌లో మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి ఈ ఫేక్ న్యూస్ బయటికొచ్చింది. ఈ వార్తపై నటి మమతా మోహన్ దాస్ ఘాటుగానే స్పందించింది. ప్రచారం కోసం మరీ ఇలా చీప్ రాతలు రాస్తారా, వ్యూస్ కోసం ఇతరుల జీవితాల గురించి ఫేక్ వార్తలు పబ్లిష్ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించింది. అసలు తన గురించి ఏమి తెలుసని ఆ రాతలు రాశారంటూ నిలదీసింది. ఇలాంటి ఫేక్ ఆకౌంట్లను ఎంకరేజ్ చేయకూడదని నెటిజన్లకు మమతా విజ్ఞప్తి చేశారు.