LOADING...
Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్!
దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్!

Samantha Ruth Prabhu: దుబాయ్‌లో సమంత అందానికి ఫ్యాన్స్ ఫిదా.. గోల్డెన్ శారీలో లుక్ సూపర్బ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందంతో, అభినయంతో, నటనతో కోట్లాది అభిమానులను ఆమె ఆకర్షించింది. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా సినిమాలకు విరామం తీసుకున్న సమంత ఇప్పుడు తిరిగి పూర్తి ఫామ్‌లోకి వచ్చిందని చెప్పాలి. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతూ, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, ఈవెంట్స్‌లో కూడా క్రేజ్ చూపిస్తోంది. తాజాగా సమంత దుబాయ్‌లో ఒక ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొంది. అక్కడ ఎంబ్రాయిడరీ నెట్ గోల్డ్ కలర్ శారీలో చాలా అందంగా మెరిసిపోగా, సింపుల్ మేకప్,హెయిర్ స్టైల్‌తో తన లుక్‌కు మరింత ఆకర్షణ ఇచ్చింది. ఆమెను చూడాలని అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు పంచుకుంటూ సమంత అక్కడ ప్రత్యేక పండగను ఏర్పరుచుకుంది.

Details

మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్న సమంత

ఈ ఫొటోలు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాల విషయానికి వస్తే, సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' చిత్రంలో కనిపించి రెండేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ'లో భాగమైంది. సమంత తన ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌లో నిర్మించిన తొలి చిత్రం 'శుభం' ఇటీవల మంచి విజయాన్ని సాధించింది. హారర్-థ్రిల్లర్ శైలి చిత్రమైన ఈ సినిమా గత మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం జూన్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది.