Page Loader
Ajith Kumar: ఫాదర్ కమ్ కోచ్! రేసింగ్‌లో ఆద్విక్‌కు ట్రైనింగ్ ఇస్తున్న అజిత్ సర్!
ఫాదర్ కమ్ కోచ్! రేసింగ్‌లో ఆద్విక్‌కు ట్రైనింగ్ ఇస్తున్న అజిత్ సర్!

Ajith Kumar: ఫాదర్ కమ్ కోచ్! రేసింగ్‌లో ఆద్విక్‌కు ట్రైనింగ్ ఇస్తున్న అజిత్ సర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది సినీ పరిశ్రమలో అజిత్ కుమార్‌కు ఓ ప్రత్యేక స్థానముంది. సినీపరిశ్రమలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా, ఒక సాధారణ యువకుడిగా తెలుగు, తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా ఎదిగారు. 'విదాముయార్చి' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. అజిత్ కుమార్‌ కేవలం నటుడిగానే కాకుండా బైక్‌, కార్‌ రేసర్‌, ఫోటోగ్రాఫర్‌, షూటర్‌గానూ ప్రసిద్ధి పొందారు. తన ఆసక్తులను వివిధ రంగాల్లో క్రమంగా అబివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. చెన్నైలోని ఐఐటీ విద్యార్థుల ఉమ్మడి ప్రయోగం 'తక్ష' డ్రోన్‌ ప్రాజెక్టుకు సలహాదారుగా వ్యవహరించడం ఆయన విభిన్నతకు నిదర్శనం.

Details

ఇటీవల పద్మ భూషణ్ అవార్డు అందుకున్న అజిత్

2025 జనవరిలో దుబాయ్‌లో జరిగిన కార్‌ రేస్‌లో తన "అజిత్ కుమార్ రేసింగ్" జట్టుతో పాల్గొన్న అజిత్‌.. 911 GT3 R విభాగంలో 3వ స్థానాన్ని సాధించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సినీ ప్రముఖులూ ఈ విజయం మీద ప్రశంసలు కురిపించారు. ఇటీవల అజిత్‌ నటుడిగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో త్రిషతో జతకట్టారు. సంగీతాన్ని జీవీ ప్రకాష్ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. అజిత్ కుమార్ తన కుమారుడు ఆద్విక్‌కు కార్ రేసింగ్‌లో శిక్షణనిస్తున్నారు.

Details

కార్ రేసింగ్ చిట్కాలు ఇస్తున్న తండ్రి

ఇటీవల పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఆద్విక్‌.. బ్రెజిల్ లెజెండ్స్ vs ఇండియా ఆల్‌స్టార్స్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ పాల్గొని తన ప్రతిభ చాటాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డిన్హో ఆద్విక్‌కు ప్రేరణగా మారాడు. తాజాగా, MIKA గోకార్ట్ సర్క్యూట్‌లో ఆద్విక్ కార్ రేసింగ్ శిక్షణలో పాల్గొన్న వీడియో వైరల్ అవుతోంది. అందులో అజిత్ కుమార్ తన కుమారుడికి కార్ రేసింగ్ చిట్కాలు ఇస్తుండటం చూడవచ్చు. ఈ వీడియోను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆద్విక్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నాడని అభిమానులు తెగ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్ రేసింగ్ చేస్తున్న అజిత్ కుమార్ కొడుకు