Sitara Ghattamaneni: నాన్నే నా ఫేవరేట్.. ఇక హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం : సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు కుమార్తె ఓ జ్యువెలరీ యాడ్ ద్వారా స్క్రీన్‌పై కనిపించింది. త్వరలోనే సితార సినిమాల్లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం సితారకు సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సితార తనకు ఇష్టమైన నటీనటుల ఎవరో చెప్పింది. రష్మిక మందన్నా, శ్రీలీల ఫేవరేట్ స్టార్స్ అని చెప్పింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా సితార
అలాగే, తన ఫేవరేట్ హీరో తన తండ్రి మహేష్ బాబుని పేర్కొంది. ఇక సితార తన యూట్యూబ్ ఛానెల్‌లో రష్మిక మందన్నకు ఇంటర్వ్యూను చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, శ్రీలీల కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. సితార ప్రస్తుతం యాక్టింగ్ క్లాసులు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేసి వీడియోలను కూడా షేర్ చేస్తుంది.