
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు
ఈ వార్తాకథనం ఏంటి
ఒకట్రెండు కాదు,దాదాపు పదిహేను నిర్మాణ సంస్థలు ఒక్కటే టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.
ఆ పేరు మరెదో కాదు.. 'ఆపరేషన్ సిందూర్'. ఈ టైటిల్‌కు సంబంధించిన హక్కులు పొందేందుకు పలువురు నిర్మాతలు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వద్ద దరఖాస్తు చేసుకున్నట్టు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
ప్రముఖ నిర్మాణ సంస్థలైన టీ సిరీస్, జీ స్టూడియోస్ తదితర సంస్థలు కూడా ఈ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
వివరాలు
'ఆపరేషన్ సిందూర్' అనే టైటిల్‌కు చాలా మంది దరఖాస్తు
ఈ టైటిల్‌కు దరఖాస్తు చేసిన నిర్మాతల్లో ఒకరైన అకోశ్ పండిట్ మాట్లాడుతూ..''ఈ పేరుతో సినిమా నిర్మించేది ఖచ్చితమేనా?అన్నదాన్ని ఇప్పుడే చెప్పలేం.కానీ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పేర్లు పెట్టాలనే ఉత్సాహం దర్శక,నిర్మాతల్లో సాధారణంగా ఉంటుంది. కేవలం పేరే అని తక్కువచేసిన సినిమాలు ప్లాన్ చేయలేం.ఇప్పటి సమకాలీన పరిస్థితులను బట్టి చూస్తే,'ఆపరేషన్ సిందూర్' అనే టైటిల్‌కు చాలా మంది దరఖాస్తు చేశారు.అయితే టైటిల్ కోసం అప్లై చేసిన వారందరూ తప్పకుండా సినిమానే తీయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారని అనుకోవచ్చు.వ్యక్తిగతంగా నేను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను బాగా అర్థం చేసుకున్నవాడిని. గత 35 సంవత్సరాలుగా బాధితుడిగా నేను పోరాడుతున్నాను. పాకిస్తాన్ మూలంగా నేను ఎదుర్కొన్న బాధలు చాలా. అందుకే ఈ విషయం నాకు ఎంతో ప్రత్యేకం'' అని అభిప్రాయపడ్డారు.
వివరాలు
సిందూరాన్ని దూరం చేసిన వారిపై భారత సైన్యం ప్రతీకారం
ఇదిలా ఉండగా, ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసిన మొదటి సంస్థగా 'మహవీర్ జైన్ ఫిల్మ్స్' నిలిచింది.
ఇక 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ప్రతీకార దాడులు దేశవ్యాప్తంగా గుర్తుండిపోతుంది.
భారతీయ సంస్కృతిలో వివాహిత మహిళలకు సిందూరానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో - ఆ సిందూరాన్ని దూరం చేసిన వారిపై భారత సైన్యం ఈ పేరుతో ప్రతీకారం తీసుకోవడం గమనార్హం.