
Peddi: పెద్దిలో ఫిల్మీమోజీ ఎంట్రీ.. చరణ్ డైలాగ్స్‌కి మాస్ ఎమోషన్ గ్యారెంటీ!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ సినిమా 'పెద్ది' కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా భారీ అంచనాలను అందుకోలేకపోయింది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్, చరణ్ వంటి టాప్ హీరోతో పాటు స్టార్ కాస్ట్ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు తమ దృష్టంతా 'పెద్ది' పై కేంద్రీకరించారు. ఈ చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడైన ఆయన తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించి, రెండో చిత్రానికే చరణ్‌తో కలిసి పని చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.
Details
త్వరలో మరో క్రేజీ అప్డేట్
చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలోని గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చరణ్ లుక్‌కి అభిమానుల నుండి విశేష స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర వాతావరణం, స్థానిక యాసతో ఈ సినిమా సాగబోతుందని సమాచారం. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఫిల్మీమోజీ టీమ్ 'పెద్ది' కోసం రంగంలోకి దిగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Details
డైలాగ్ రైటింగ్ కోసం సాయం
ఉత్తరాంధ్ర యాస, స్థానిక వాడుక భాషలో డైలాగులు రాసేందుకు బుచ్చిబాబు, ఫిల్మీమోజీ టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫిల్మీమోజీ సాయి కిరణ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బుచ్చిబాబు గారు 'పెద్ది' సినిమాలో కొన్ని డైలాగ్‌లకు సహాయం చేయమని అడిగారు. నేను ఫిల్మీమోజీ షూట్‌లతో బిజీగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయినా, కొంత మేరకు డైలాగ్ రైటింగ్‌లో సాయం చేశానని ఆయన వివరించాడు.