
Idly Kadai: ధనుష్ సినిమా 'ఇడ్లీ కడై' సెట్లో అగ్నిప్రమాదం.. కీలక సామగ్రి దగ్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ తమిళ నటుడు ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇడ్లీ కడై' షూటింగ్ సెట్‌లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడు తేని జిల్లాలోని అండిపట్టిలో ఏర్పాటు చేసిన సినిమా సెట్లో అర్థరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఈ ఘటనతో సెట్‌లో ఉన్న కీలకమైన సామగ్రి పూర్తిగా కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం జరిగిందని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ప్రమాదానికి గల కారణాలపై అండిపట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో సెట్లో షూటింగ్ జరగకపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం.
Details
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్
పాన్ ఇండియా స్టార్ ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో శరవేగంగా దూసుకుపోతున్నారు.
ఇటీవలే 'రాయన్' అనే చిత్రంలో నటించిన ఆయన, ఆ తరువాత 'నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబం' అనే తమిళ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు.
ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడై' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుష్‌తో పాటు ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.