
Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం'పై హైప్ మామూలుగా లేదు.
14ఏళ్ల తర్వాత వీరద్దరి కలయికలో సినిమా వస్తుండటం.. అలాగే ఇది హ్యాట్రిక్ మూవీ కావడంతో విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి ట్రెండింగ్‌లో ఉంటూ వస్తోంది.
ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా.. అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డు సృష్టించింది. ట్రైలర్ విడుదలైన 24గంటల్లో 39మిలియన్ల వ్యూస్‌తో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
తాజాగా 'గుంటూరు కారం'కు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. మరి అది ఎలా ఉందో తెలుసుకుందాం.
మహేష్
పంచ్ డైలాగ్స్ , యాక్షన్‌తో అదరగొట్టిన మహేష్
దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు 'గుంటూరు కారం' సినిమా ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూస్తారని ఉమైర్ సందు పేర్కొన్నారు.
పంచ్ డైలాగ్స్ ,యాక్షన్‌తో మహేష్ ఈ సినిమాలో అదరగొట్టినట్లు చెప్పుకొచ్చారు.
మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ఉమైర్ రివ్యూలు చాలా వరకు నెగిటివ్‌గా ఉంటాయి. ఆయన పాజిటివ్‌గా చెప్పడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ చెప్పడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం, కీలక పాత్రలు పోషిస్తున్నారు.