Page Loader
Operation Valentine: వాఘా సరిహద్దుకు వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా? 
Operation Valentine: వాఘా సరిహద్దుకు వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా?

Operation Valentine: వాఘా సరిహద్దుకు వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2024
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

గాండీవధారి అర్జున సినిమా తర్వాత,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్‌. ఈ సినిమా ఫిబ్రవరి 16 రిలీజ్'కు సిద్ధమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా మానుషి చిల్లర్ నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాఘా సరిహద్దులో ఈ రోజు మొదటి సింగల్ ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Details 

ఈ రోజు సాయంత్రం ఆన్‌లైన్ లో విడుదల

ఈ సింగల్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బెంగళూరు నుండి నేరుగా అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఈ పాటను తెలుగు అనురాగ్ కులకర్ణి పాడగా, హిందీలో సుఖ్‌విందర్ సింగ్ పాడారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్‌ సంగీత దర్శకత్వం వహించారు. ఈ పాట ఈ రోజు సాయంత్రం 05:02 గంటలకు ఆన్‌లైన్ లో విడుదల అవుతుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,రినైసాన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ పాట ఎంతో స్పెషల్ అంటున్న వరుణ్