Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ మొదటి సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది
గాండీవధారి అర్జున సినిమా తర్వాత,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్ . ఈ సినిమా ఫిబ్రవరి 16 రిలీజ్'కు సిద్ధమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా మానుషి చిల్లర్నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా టీమ్ అధికారిక ప్రకటన చేసింది.మొదటి సింగిల్,వందేమాతరం,జనవరి 17న విడుదల కానుందని తెలిపింది. భారతదేశంలోని అమృత్‌సర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో ఈ పాటను ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,రినైసాన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్.