
Devi Sri Prasad: విదేశీయులు 'ఊ అంటావా' పాటను కాపీ కొట్టారు : దేవీ శ్రీ ప్రసాద్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉండటంతో ప్రపంచంలోని సినిమాలు, సంగీతం, కళలన్నీ అందరికీ సులభంగా చేరుతున్నాయి. ఈ పరిణామంతో పాటల మ్యూజిక్, సినిమా కథలు, కళాశైలులు సులువుగా కాపీకి గురవుతున్నాయి. గతంలో హాలీవుడ్ సినిమాల కథలు, దక్షిణాది, ఉత్తరాది టెక్నీషియన్లు కాపీ చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చేవి. అయితే తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా చెప్పిన విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు డ్రీమ్స్ ప్రారంభ వేడుకలో మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్, 'చెన్నైలో కేవలం ఐదు నిమిషాల్లో కంపోజ్ చేసిన 'ఊ అంటావా.. ఊహు అంటావా' పాటను విదేశీయులు కాపీ చేశారు. వాళ్ల మీద కేసు వేయాలా? లేక వదిలేయాలా? అనే దానిపై ఆలోచిస్తున్నానని తెలిపారు.
Details
కాపీ కొడితే క్రెడిట్ ఇవ్వాలి కదా
అయితే ఈ పాటను ఇతరులు కాపీ చేయడం ఒక అంగీకారంగా కూడా భావిస్తున్నానని చెప్పారు. దేవి శ్రీ మాటలతో పాటుగా నెటిజన్లు 'ఆ పాటను ఎవరు కాపీ చేశారు?' అనే ప్రశ్నతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఏడాది క్రితం టర్కీకి చెందిన సింగర్ అతియే, ఊ అంటావా మ్యూజిక్‌ని తీసుకుని 'అన్లయినా' అనే టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ రూపొందించిందని వెలుగులోకి వచ్చింది. ఆమె పాట ట్యూన్, వాతావరణం, మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ అన్ని మన ఊ అంటావా పాటతో పోలిస్తే ఒక్కటే అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు 'కాపీ కొడితే కనీసం క్రెడిట్ అయినా ఇవ్వాలి కదా' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Details
సోషల్ మీడియాలో పాట వైరల్
ప్రస్తుతం ఈ రెండు పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'ఊ అంటావా' పాటకు సమంత నర్తించగా.. ఈ పాట ఘన విజయాన్ని సాధించింది. క్రికెటర్ల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదే సమయంలో పలు నెటిజన్లు ఈ పాటకు దేవిశ్రీ గతంలో సూర్య నటించిన 'వీడోక్కడే' సినిమాలో ఉన్న 'హానీ హానీ' పాట ట్యూన్‌ను కాపీ చేశాడని ఆరోపించారు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ గానీ, పుష్ప చిత్ర బృందం గానీ స్పందించలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పాట ఇదే
They copied Oo Antava Mama from Pushpa film and thought no one would notice. Unfortunately copyright law doesn't apply to tones and chords. pic.twitter.com/c2cbAPQcBa
— Lord Immy Kant (@KantInEastt) July 15, 2025