LOADING...
Sreeleela: డ్యాన్స్ నుంచి స్పోర్ట్స్ వరకూ.. శ్రీలీల కొత్త అవతారం!
డ్యాన్స్ నుంచి స్పోర్ట్స్ వరకూ.. శ్రీలీల కొత్త అవతారం!

Sreeleela: డ్యాన్స్ నుంచి స్పోర్ట్స్ వరకూ.. శ్రీలీల కొత్త అవతారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

'నువ్వు నా వాడివి.. నువ్వే నా ప్రతి ఆనందానివి' అంటూ ఇంకా పేరు ఖరారు కాని ఓ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల. ఆ సినిమా విడుదలకు ముందే ఈ జంట మరో ప్రాజెక్ట్ కోసం మళ్లీ జోడీ కట్టబోతున్నట్లు సమాచారం. 'చందు ఛాంపియన్' దర్శకుడు ఖబీర్ ఖాన్‌తో కార్తిక్ కొత్త సినిమా చేయనున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసే దిశగా చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Details

కిక్‌బాక్సింగ్ కోచ్ పాత్రలో కార్తిక్

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తిక్ కిక్‌బాక్సింగ్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైందని, 2027లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముందని శ్రీలీల సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తన డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకునే శ్రీలీల, కార్తిక్‌తో మరోసారి జోడీ కడితే ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.

Advertisement