Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుంచి 'ఓజీ' వరకు.. అన్ని సినిమాలు పూర్తి చేస్తానన్న పవన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, నటుడిగా పవన్ కళ్యాణ్ తన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
ఆయన హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ మూవీ 'ఓజీ' షూటింగ్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా, అభిమానులు 'ఓజీ.. ఓజీ..' అంటూ నినాదాలు చేస్తున్నారు.
తాజాగా మంగళగిరిలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఓజీ సినిమా 1980-90ల కాలంలో జరిగిన కథ అని, అభిమానులు ఎక్కడికెళ్లినా 'OG OG' అని నినాదాలు చేయడంతో తనకు ఓ ప్రెషర్ లాగా అనిపిస్తోందన్నారు.
తాను ఒప్పుకున్న ప్రతి సినిమాకూ డేట్స్ ఇచ్చానని, కానీ దర్శక, నిర్మాతలు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.
Details
క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా అవసరం
'హరిహర వీరమల్లు' చిత్రానికి మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందన్నారు.
అన్ని సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని పవన్ అన్నారు. సినిమా పరిశ్రమలో పెద్ద మార్పులు రావాలని, ఇండస్ట్రీకి చెందిన వారందరూ కూర్చొని చర్చించాలన్నారు.
పాపికొండలు, విజయనగరం అటవీ ప్రాంతాల్లో అందమైన లొకేషన్లు ఉన్నాయని, అయితే ఆ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అవసరమన్నారు.
క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎంతో కీలకమని, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే మంచి సినిమాలు రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.