
AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' జూన్ 12న గ్రాండ్‌గా థియేట్రికల్‌గా విడుదల కాబోతోంది.
రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, మూడు పాటలు విడుదల కాగా, తాజాగా మొదటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Details
ప్రమోషన్‌కు తక్కువ టైమ్, కానీ భారీ ప్లాన్
ప్రమోషన్లకు చాలినంత టైమ్ లేకపోయినా, ఇంకొన్ని పెద్ద ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు. నాకు ఎప్పుడూ మెసేజ్ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది.
అందుకే భారతీయుడు, ఒకే ఒక్కడు, నాయక్ వంటి చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా అదే కోవకు చెందుతుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో మూడో సినిమా
ఇదివరకూ పవన్ కళ్యాణ్‌తో ఖుషి, బంగారం చిత్రాలు చేశాం. ఇప్పుడు ఇది మూడో సినిమా. గతంలో ఆయన దర్శకత్వంలో సత్యాగ్రహి అనే సినిమాను అనౌన్స్ చేశాం.
పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సత్యాగ్రహి అంటే 'సత్యం కోసం ఆగ్రహించేవాడు, న్యాయం కోసం ప్రాణాలు కూడా అర్పించేందుకు సిద్ధమనే భావన.
Details
తమిళ్ 'వేదాళం' రీమేక్ కూడా ఆగిపోయింది
పవన్‌తో తమిళ్ బ్లాక్‌బస్టర్ 'వేదాళం' రీమేక్ ప్లాన్ చేశాం. అయితే ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది.
గతంలో 'ఖుషి' సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేయాలని పవన్ కళ్యాణ్ అడిగారు.
కానీ అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. కానీ హరిహర వీరమల్లు మాత్రం పూర్తి పాన్ ఇండియా కాన్సెప్ట్. అందుకే ఇది హిందీలో కూడా విడుదలవుతుంది.
ఉత్తరాదిలో కూడా ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని వెల్లడించారు.