
Bollywood : మెగాస్టార్ నుంచి యంగ్ టైగర్ వరకు.. బాలీవుడ్‌లో మన హీరోలకు ఎదురైన చేదు అనుభవాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా సౌత్ హీరోయిన్‌లు పెద్ద స్థాయికి ఎదిగాక బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు. అక్కడ మంచి స్థిరపడతారు కూడా. కానీ మన తెలుగు హీరోల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. గెస్ట్ రోల్స్, పాన్ ఇండియా సినిమాలు బాగానే చేసేవారు కానీ డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు మాత్రం వద్దంటున్నారు. ఎందుకంటే గతంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోలందరూ అక్కడ పెద్దగా రాణించలేకపోయారు.
Details
చిరంజీవి
90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగాక బాలీవుడ్‌లో కూడా ప్రయత్నించారు. ప్రతి బంధ్, ఆజ్ కా గూండారాజ్ లాంటి సినిమాలతో అక్కడ కూడా హిట్స్ ఇచ్చారు. కానీ 'ది జెంటిల్‌మెన్' భారీ ఫ్లాప్ కావడంతో బాగా షాక్ తిన్నారు. అక్కడ హిట్స్ ఇచ్చినా ఇక్కడ ఉన్నంత ఫేమ్ రాకపోవడం, ఫ్లాప్స్ రావడంతో చివరికి బాలీవుడ్‌ను పూర్తిగా వదిలేశారు.
Details
నాగార్జున
శివ సినిమా హిందీ వెర్షన్ కూడా హిట్ అవ్వడంతో నాగార్జున వరుసగా ద్రోహి, ఖుదా గవా, క్రిమినల్ వంటి పలు సినిమాలు చేశారు. గెస్ట్ రోల్స్ కూడా చేశారు. మొత్తంగా దాదాపు 10 సినిమాలు బాలీవుడ్‌లో చేశారు. మొదట్లో కొన్నివరకు హిట్స్ ఇచ్చినా చివర్లో 'అగ్ని వర్ష' ఘోర ఫ్లాప్ కావడంతో వెనక్కి వచ్చేశారు. టాలీవుడ్‌లో ఉన్నంత స్టార్‌డమ్ బాలీవుడ్‌లో రాకపోవడంతో అక్కడ ఎక్కువ కాలం నిలవలేకపోయారు. వెంకటేష్ చంటి హిట్ కావడంతో దాన్ని హిందీలో 'అనారి'గా రీమేక్ చేశారు. అది హిట్ అయినా తర్వాత చేసిన 'తక్ధీర్వాలా' ఘోర ఫ్లాప్ కావడంతో వెంకీ కూడా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పారు. ఇక బాలయ్య మాత్రం ఎప్పటినుంచో బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా వాటిని తప్పించుకున్నారు.
Details
నేటితరం హీరోలు
రామ్ చరణ్ 'జంజీర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ప్రభాస్ ఆదిపురుష్లో నటించారు. కానీ ఆ సినిమా విమర్శలు, వివాదాలు ఎదుర్కొని కమర్షియల్‌గా కూడా నిలబడలేదు. ఎన్టీఆర్ 'వార్ 2' చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నా కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో సినిమా యావరేజ్‌గానే మిగిలింది. మహేష్ బాబు అయితే డైరెక్ట్‌గా 'నేను బాలీవుడ్ సినిమాలు చేయనని స్పష్టంగా చెప్పేశారు. అల్లు అర్జున్ రాజ్‌కుమార్ హిరానీతో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి కానీ అవి సక్సెస్ కాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు కానీ ఘోర పరాజయం చూశాడు. గతంలో సీనియర్లు కొన్నిసార్లు హిట్స్ ఇచ్చినా స్టార్‌డమ్ మాత్రం రాలేదు.