Mammootty: మహమ్మద్ కుట్టీ నుంచి మమ్ముట్టి వరకు… మెగాస్టార్ పేరు వెనుకున్న ఆసక్తికర కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సినీ పరిశ్రమలో 'మెగాస్టార్'గా అపారమైన అభిమానులను సంపాదించుకున్న నటుడు మమ్ముట్టి, తన పేరుకి సంబంధించిన ఆసక్తికరమైన నేపథ్యాన్ని ఇటీవల వెల్లడించారు. అసలు పేరు మహమ్మద్ కుట్టీ అయిన ఆయన అది ఎలా 'మమ్ముట్టి'గా మారిందో ఒక ప్రత్యేక కార్యక్రమంలో వివరించారు. అంతేకాకుండా ఆ పేరును ఏర్పరిచే కారణమైన తన చిన్ననాటి స్నేహితుడిని కూడా అభిమానులకు పరిచయం చేశారు. కేరళలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో మమ్ముట్టి తన కాలేజీ రోజుల జ్ఞాపకాలు పంచుకున్నారు. కాలేజీ సమయంలో నేను అందరికీ నా పేరు ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడిని. నా అసలు పేరు మహమ్మద్ కుట్టీ అని ఎవరికీ తెలియదు.
Details
మమ్ముట్టి అని తప్పుగా చదివారు
ఒక రోజు అనుకోకుండా నా ఐడీ కార్డు తీసుకురావడం మరిచిపోయాను. దీంతో నా అసలు పేరు కాలేజీ మొత్తానికి తెలిసిపోయిందని చెప్పారు. ఆ సమయంలో తన స్నేహితుడు శశిధరన్, ఐడీ కార్డులో ఉన్న 'మహమ్మద్ కుట్టీ' అనే పేరును పొరపాటున 'మమ్ముట్టి'గా చదివినట్టు మమ్ముట్టి గుర్తుచేశారు. అతను తప్పుగా పలికిన ఆ పేరే తర్వాత నాకు నిలిచిపోయిందని నవ్వుతూ తెలిపారు. అనంతరం ఆయన శశిధరన్‌ను వేదికపైకి పిలిచి ప్రేక్షకులకు పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.