Vijay Devarakonda: అర్ఎక్స్ 100 నుంచి సీతారామం వరకు.. విజయదేవర కొండ వదులుకున్న సినిమాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
చాలా తక్కువ సినిమాలతో యూత్‌కి ఫెవరెట్ హీరోగా నిలిచిన విజయ్ దేవరకొండ, స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేసిన తప్పుల వల్ల వరుస డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.
'ఖుషీ'తో కమ్‌బ్యాక్ ఇచ్చిన విజయ్‌కి, 'ఫ్యామిలీ స్టార్' ఘోరమైన ఫలితం ఇచ్చింది.
కానీ అతను రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆ సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
1.అర్ఎక్స్ 100
అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు తొలుత ఆఫర్ అయ్యింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
చివరకు కార్తికేయ ఈ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్నాడు.
Details
2. భీష్మ
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఫ్లాప్‌లలో ఉన్న నితిన్‌కి ఈ సినిమా రిలీఫ్‌గా నిలిచింది.
తొలుత ఈ సినిమా స్క్రిప్ట్ విజయ్ దేవరకొండకు వినిపించగా, కథ నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేశాడు.
3. ఉప్పెన
పంజా వైష్ణవ్ తేజ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన 'ఉప్పెన' సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ కథను మొదట విజయ్ దేవరకొండతో చేయాలని అనుకున్నారు.
కానీ కథ నచ్చకపోవడంతో విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశాడు.
Details
4. ఇస్మార్ట్ శంకర్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూరీకి రీసెంట్ కాలంలో వచ్చిన పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ కథను మొదట విజయ్ దేవరకొండకు వినిపించినా హీరో క్యారెక్టర్ నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేశాడు.
కానీ అదే పూరీతో 'లైగర్' తీసి అతని కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
5. సీతా రామం
దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా 'సీతా రామం'. విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నారు.
అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'లో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయలేకపోయాడు.
విజయ్ దేవరకొండకు రిజెక్ట్ చేసిన సినిమాలు అతడి కెరీర్‌పై పెద్ద ప్రభావాన్ని చూపించాయి