
Rashmika : సౌత్ నుంచి బాలీవుడ్ టాప్ వరకు.. కాక్‌టెయిల్ 2లో రష్మిక మందన్న
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న అగ్రనటి రష్మిక మందన్న, ప్రస్తుతం రెండు ఇండస్ట్రీల్లోనూ టాప్ స్థాయిలో దూసుకుపోతోంది. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఆమె, హిందీ సినిమాలలో కూడా సత్తా చాటుతోంది. గత ఏడాది 'ఛావా' చిత్రంతో బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న 'తమా' చిత్రంలో నటిస్తున్నారు. ఇదే వేళ, ఆమె మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2012లో విడుదలైన 'కాక్‌టెయిల్' చిత్రం గుర్తుందా? సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా ప్రేమ, స్నేహం, అనుబంధాల చుట్టూ తిరుగుతూ అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. రష్మిక ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్టు చాలాకాలంగా వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టతనిచ్చారు. షూటింగ్ లొకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ, 'అపరిమితమైన వినోదానికి సిద్ధంగా ఉండండంటూ క్యాప్షన్ జోడించారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 'కాక్‌టెయిల్ 2' ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ అప్‌డేట్‌తో బాలీవుడ్ ఆడియెన్స్‌లో హైప్ మరింత పెరిగింది.