
Telugu Movies This week: థగ్ లైఫ్ నుంచి గ్యాంబ్లర్స్ వరకు.. జూన్ ఫస్ట్ వీక్‌లో థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ నెల మొదటి వారంలో సినిమా ప్రేమికులకు భారీ వినోద విందు దక్కనుంది. పెద్ద సినిమాలూ, చిన్న చిత్రాలూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఓవైపు థియేటర్లు సందడిగా మారనున్నాయి. మరోవైపు ఓటిటిల్లో నూతన కంటెంట్ జోరందుకోనుంది. ఇప్పుడిదే ఓ లుక్కేయండి. కమల్-మణిరత్నం కాంబో 'థగ్ లైఫ్' ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికే 'థగ్ లైఫ్'తో వస్తున్నానని కమల్‌హాసన్ చెబుతున్నాడు. శింబు, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. 'నాయకన్' (1987) తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
Details
తొలి సినిమాతోనే నితిన్ వచ్చేస్తున్నాడు
'మ్యాడ్', 'ఆయ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నార్నె నితిన్ హీరోగా నటించిన తొలి చిత్రం 'శ్రీశ్రీశ్రీ రాజావారు'. సంపద కథానాయికగా నటిస్తుండగా, దర్శకత్వం వహించిన సతీశ్ వేగేశ్న. ఇది ప్రేమ, కుటుంబ నేపథ్యంతో రూపొందిన చిత్రం. 2022లోనే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం చివరికి జూన్ 6న విడుదలవుతోంది. నవ్వులు పంచేందుకు 'హౌస్‌ఫుల్ 5' సిద్ధం బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీగా ప్రత్యేక గుర్తింపు పొందిన 'హౌస్‌ఫుల్' ఇప్పుడు 'హౌస్‌ఫుల్5' రూపంలో ప్రేక్షకుల ముందుకురానుంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్, నర్గీస్ ఫక్రీ, జాకీ ష్రాఫ్ తదితరులు నటించిన ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
Details
మిస్టరీ మూడ్‌లో 'గ్యాంబ్లర్స్'
సంతోష్ శోభన్ హీరోగా చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'గ్యాంబ్లర్స్'. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులతో సినిమా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో చిత్రబృందం ఉంది. ఈ మూవీ కూడా జూన్ 6న విడుదలవుతోంది. నవ్వుల పండుగ 'బద్మాషులు' మహేశ్ చింతల, విద్యాసాగర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించిన 'బద్మాషులు' సినిమాను శంకర్ చేగూరి డైరెక్ట్ చేశారు. బి.బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మాతలు. ఇది జూన్ 6న నవ్వుల రైడ్‌గా థియేటర్లలో ప్రవేశించనుంది.
Details
ఓటిటి వేదికపై వస్తున్న చిత్రాలు
నెట్‌ఫ్లిక్స్ వన్ ఆఫ్ దెమ్ డేస్ (హాలీవుడ్) - జూన్ 4 జాబ్ (హిందీ) - జూన్ 5 అమెజాన్ ప్రైమ్ స్టోలెన్ (హిందీ) - జూన్ 4 జియో సినిమాస్/హాట్‌స్టార్: టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) - జూన్ 2 గజానా (హిందీ)** - జూన్ 2 దేవికా అండ్ డానీ (తెలుగు వెబ్‌సిరీస్) - జూన్ 6