Loading...
Sai Dharam Tej : వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఫుల్‌ రెమ్యునరేషన్‌.. ఆ నిర్మాతను మర్చిపోలేను: సాయి తేజ్
వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఫుల్‌ రెమ్యునరేషన్‌.. ఆ నిర్మాతను మర్చిపోలేను: సాయి తేజ్

Sai Dharam Tej : వరుస ఫ్లాపుల్లో ఉన్నా ఫుల్‌ రెమ్యునరేషన్‌.. ఆ నిర్మాతను మర్చిపోలేను: సాయి తేజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

'జవాన్', 'కృష్ణమ్మ' చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. తాజాగా 'కాగితం పడవలు' సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టకాలాన్ని గుర్తు చేసుకున్నారు. వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తనను నమ్మి, తాను అడగకుండానే పూర్తి రెమ్యునరేషన్‌ ఇచ్చిన ఏకైక నిర్మాత కృష్ణ గారేనని వేదికపై సాయి ధరమ్‌ తేజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన నిర్మాత కృష్ణను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని సాయి తేజ్‌ తెలిపారు. ఆయన చేసిన ఈ ఎమోషనల్‌ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

వివరాలు

ఫుల్ గా సపోర్టు చేశారు

ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. "మా ప్రొడ్యూసర్‌ కృష్ణ గురించి చెప్పాలి. 2017లో నాకు 'జవాన్‌' సినిమా ప్రొడ్యూస్‌ చేశారు.

నాకు బాగా సపోర్ట్‌ చేసి, ఎక్కడా వెనకాడకుండా సినిమాకి కావాల్సిన ఖర్చు పెట్టేశారు. ఎక్కడా ఏ కంప్లైంట్స్‌ లేకుండా.. ఆయన ఇందాక చెప్పినట్టుగా అందరికంటే ఫస్ట్‌ సెట్‌లో ఉంటారు.

ఆయన సపోర్ట్‌ మామూలు సపోర్ట్‌ కాదండి కృష్ణ గారు. నాతో మాట్లాడినందుకు చాలా చాలా థాంక్స్‌ అండి. అండ్‌ నా ఫేవరెట్‌ ప్రొడ్యూసర్‌.

నేను చాలాసార్లు చెప్పాను, మళ్లీ చెప్తున్నాను.. నాకు ఫుల్‌ రెమ్యునరేషన్‌ ఇచ్చిన ప్రొడ్యూసర్‌ ఈయన ఒక్కరే. అంటే.. ఆ టైంలో నేను కొద్దిగా ఫ్లాప్స్‌లో ఉన్నాను.

వివరాలు

ఫుల్ రెమ్యునరేషన్ ఇచ్చారు

కానీ ఆ ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు ఎవరూ అంత ఫుల్‌ రెమ్యునరేషన్‌ ఇవ్వలే. ఈయన మాత్రం నాకు ఫుల్‌ రెమ్యునరేషన్‌ ఇచ్చిన వ్యక్తి.

ఇది నా లైఫ్‌ లాంగ్‌ గుర్తుపెట్టుకుంటాను" అని సాయి ధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు. అనంతరం నిర్మాత కృష్ణకు ప్రేక్షకులంతా మద్దతుగా నిలవాలని సాయి తేజ్‌ కోరారు.

ఆయన గతంలో నిర్మించిన 'కృష్ణమ్మ' సినిమా కూడా చాలా మంచి సినిమా అని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు 'కాగితం పడవలు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలిపారు.

అందరూ కలిసి సినిమాకు బ్లెస్సింగ్స్‌ ఇవ్వాలని కోరారు. ఇక 'తలరాత' గురించి కూడా సాయి ధరమ్‌ తేజ్‌ తనదైన రీతిలో మాట్లాడారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి

"తలరాత.. ఇందాకైతే నేను మోసం అని చెప్పాను కానీ, అది కాదని.. మన మనసు ఏం రాసుకుంటే అది తలరాత. సారీ.. తలరాత రాసుకుంటే అది మనసు రాసుకున్నట్టే!" అని అన్నారు.

చివరగా ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూడాలని, థియేటర్లకు వచ్చి చిత్రాన్ని ఆదరించాలని సాయి ధరమ్‌ తేజ్‌ కోరారు.

"సో ప్లీజ్‌ దయచేసి మీరందరూ సినిమా చూడండి, థియేటర్‌కి రండి అండ్‌ ప్లీజ్‌ బ్లెస్‌ ద హోల్‌ టీమ్‌" అని సాయి ధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT