LOADING...
Funky Teaser: హిలేరియస్ కామెడీతో అలరించిన విశ్వక్ సేన్ 'ఫంకీ' టీజర్ .. 

Funky Teaser: హిలేరియస్ కామెడీతో అలరించిన విశ్వక్ సేన్ 'ఫంకీ' టీజర్ .. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, 'జాతిరత్నాలు' ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'ఫంకీ'. ఇది కామెడీ ,ఎంటర్టైన్‌మెంట్ మిశ్రమంతో రూపొందుతున్న చిత్రం. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి ఆసక్తి ఏర్పడింది. తాజాగా విడుదలైన టీజర్‌లోని ఫన్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు.

వివరాలు 

టీజర్ 

'ఫంకీ' టీజర్‌లో విశ్వక్ సేన్ ఓ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తుండగా.. కాయదు అతని సినిమా హీరోయిన్‌గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంతో వీరిద్దరి మధ్య సాగే లవ్ స్టోరీ అనుదీప్‌ స్టైల్‌లో హాస్యభరితంగా, ఫన్ రైడ్‌గా రూపొందించినట్లు టీజర్ సూచిస్తుంది. డైలాగ్స్, క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిసి టీజర్‌ను హిలేరియస్‌గా మార్చేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్