టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోన్న సుడిగాలి సుధీర్ గాలోడు: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే?
సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు చిత్రం, టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జీ తెలుగులో ప్రసారకానుంది. కామెడీ అండ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను మెప్పించిన గాలోడు, జూన్ 25న ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు జీ తెలుగులో టెలిక్యాస్ట్ అవ్వనుంది. గాలోడు కథ: రజనీకాంత్ (సుధీర్) ఏ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా గాలోడిలా తిరుగుతుంటాడు. పేకాట ఆడుతుంటే జరిగిన గొడవలో ఆ గ్రామ సర్పంచ్ కొడుకును చంపి ఊరి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వస్తాడు. సిటీకి వచ్చిన రజనీకాంత్ బిచ్చగాళ్ల వద్ద డబ్బు కొట్టేస్తూ, గుళ్లో ప్రసాదం తింటూ గడుపుతుంటాడు. ఈ క్రమంలోనే రజనీకాంత్ కు శుక్ల (గెహనా సిప్పీ) పరిచయం అవుతుంది.
గాలోడు ప్రేమలో శుక్లా
రజనీకాంత్ పరిస్థితి చూసిన శుక్ల తన ఇంట్లోనే డ్రైవర్ గా ఉద్యోగం ఇస్తుంది. తర్వాత రజనీకాంత్ ను లవ్ చేస్తుంది. ప్రపోజ్ చేస్తే రజనీకాంత్ ఒప్పుకోడు. ఇంతలోనే రజనీకాంత్ ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రజనీకాంత్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మరి రజనీకాంత్.. శుక్ల ప్రేమను ఒప్పుకున్నాడా? వారిద్దరి ప్రేమ గెలిచిందా? పెళ్లి చేసుకున్నారా? అనే తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి.