OTT : ఓటీటీలోకి 'గేమ్ ఛేంజర్'.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన అమెజాన్!
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ చేంజర్' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా సినిమా అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
అయితే అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసను అందుకున్నారు. తాజాగా 'గేమ్ చేంజర్' ఓటిటి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Details
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్' భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇవాళ్టి నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
థియేటర్లలో మిశ్రమ స్పందనను ఎదుర్కొన్న ఈ చిత్రం ఓటీటీలో ఎంతవరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
అయితే అభిమానులు అదనపు నిడివితో సినిమా స్ట్రీమింగ్ చేయాలని కోరగా, అమెజాన్ ప్రైమ్ మాత్రం **థియేట్రికల్ వెర్షన్ అయిన 2 గంటల 38 నిమిషాల నిడివితోనే విడుదల చేసింది.