Page Loader
Game Changer X Review: 'గేమ్‌ ఛేంజర్‌' గురించి నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? 
'గేమ్‌ ఛేంజర్‌' గురించి నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?

Game Changer X Review: 'గేమ్‌ ఛేంజర్‌' గురించి నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాఫ్యాన్స్‌ మూడు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ సోలో హీరోగా నటించిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా మెరిసింది. దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌, దిల్ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ప్రచార చిత్రాలు, పాటలు, ప్రమోషన్స్‌ కారణంగా సినిమాపై పెద్ద ఎత్తున హైప్‌ ఏర్పడింది.

వివరాలు 

సినిమా విడుదల: 

భారీ అంచనాల మధ్య జనవరి 10న సినిమా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్‌ షో బొమ్మ పడగా, తెలంగాణలో ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెంకీ రివ్యూస్ ట్వీట్ 

వివరాలు 

పాటలు, నేపథ్య సంగీతం: 

ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. కొందరు సినిమా బాగుందని అంటుంటే, మరికొందరు ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. రామ్‌ చరణ్‌ నటనపై ప్రశంసలు వెల్లువెత్తగా, శంకర్‌ మేకింగ్‌ విషయంలో కొంత నిరాశ వ్యక్తమైంది. పాటలు తెరపై చూడటానికి అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా "రా మచ్చా మచ్చా" పాట బాగా ఆకట్టుకుందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

వివరాలు 

ఫస్ట్‌ హాఫ్‌ విశేషాలు: 

ఫస్ట్‌ హాఫ్‌ యావరేజ్‌గా ఉందని, ఐఏఎస్‌ బ్లాక్స్‌, ఇంటర్వెల్‌ సీన్‌ ఆకట్టుకున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. ప్రేమకథ మరీ బోరింగ్‌గా ఉందని, కామెడీలో కొంత అసమర్థత ఉందని తెలిపారు. సెకండ్‌ హాఫ్‌ అంచనాలు: ఇంటర్వెల్‌ సీన్‌ సినిమాపై హైప్‌ పెంచిందని, సెకండ్‌ హాఫ్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. శంకర్‌ తన టేకింగ్‌ పవర్‌ మరోసారి చూపించాడని, రామ్‌ చరణ్‌ తన నటనతో ఆకట్టుకున్నాడని నెటిజన్లు పేర్కొన్నారు. మొత్తం మీద: 'గేమ్‌ ఛేంజర్‌'పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అద్భుతమైన పాటలు, బీజీఎం, కొన్ని అద్భుతమైన సన్నివేశాలు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కథన పరంగా ఆసక్తి తగ్గినట్లు భావిస్తున్నారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్కీ ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెన్సార్ రిపోర్ట్స్ ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూవీ గాసిప్స్ ట్వీట్