Game Changer: గేమ్ ఛేంజర్' తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే
ఈ వార్తాకథనం ఏంటి
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'గేమ్ ఛేంజర్'.
రాజకీయ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ అప్పన్న పాత్రలో జీవించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రూ.47 కోట్లు వసూలు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.38 కోట్లు వచ్చినట్లు సమాచారం. బుక్ మై షో వెల్లడించిన వివరాల ప్రకారం, 'గేమ్ ఛేంజర్' తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
వారాంతంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనపై ప్రశంసలు అందుతున్నాయి.
Details
'నానా హైరానా' పాటను తొలగించిన చిత్ర బృందం
'అప్పన్న, రామ్ నందన్ పాత్రల కోసం చరణ్‌కు వస్తున్న ప్రశంసలు చూస్తే గర్వంగా ఉందని, చిత్రబృందానికి శుభాకాంక్షలని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
'కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలో నువ్వు నిజంగానే గేమ్ ఛేంజర్. లవ్ యూ' అని ఉపాసన పోస్ట్ చేసింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని అందించారు.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో 'నానా హైరానా' అనే పాటను తొలగించినట్లు చిత్రబృందం ప్రకటించింది.
సాంకేతిక కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, జనవరి 14 నుంచి ఈ పాటను చిత్రంలో జోడిస్తామని తెలిపారు.