Game Changer: గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ చేంజర్" సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించగా, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కారణంగా, ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 4న యూఎస్ఏలో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రాజమండ్రి లేదా వైజాగ్ ప్రాంతాల్లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు పరిశీలనలు
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు మరింత వేగం పెంచిన చిత్ర బృందం, స్థానికంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం వేదికను అన్వేషిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి లేదా వైజాగ్ ప్రాంతాల్లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, "గేమ్ చేంజర్" హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 27న ఈవెంట్‌లో లేదా ఆన్‌లైన్‌లో విడుదల చేయాలన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి.