GameChanger :'గేమ్ ఛేంజర్' ట్రైలర్ ట్రైలర్ డేట్, టైమ్ లాక్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం త్వరలోనే రాబోతోంది.
మరి కొన్ని రోజుల్లో, జనవరి 10న, భారీ అంచనాలతో మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి ఆనందం మొదలుకానుంది.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ "గేమ్ ఛేంజర్" థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు అభిమానుల్లో విశేషమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు "గేమ్ ఛేంజర్" నుండి "జరగండి", "రా మచ్చా", "నానా హైరానా", "డోప్" పాటలు విడుదలవగా, అవి అన్ని చార్ట్ బస్టర్లుగా మారాయి.
తమన్ సంగీతం అందించిన ఈ పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
వివరాలు
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం
ఇప్పుడు,గేమ్ ఛేంజర్ ట్రైలర్‌పై మేకర్స్ సూపర్ అప్‌డేట్ ఇచ్చారు.నూతన సంవత్సరం కానుకగా, జనవరి 2న సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ,సినిమాలోని రామ్ చరణ్ 'అప్పన్న'పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు.
అప్పన్న లుక్‌లో రామ్ చరణ్ అదరగొట్టాడని చెప్పడం తప్ప కాదు.ఇక,ఈ వారంలోనే గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలోని రాజమండ్రి నగరంలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారని సమాచారం.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత,దిల్ రాజు పవర్ స్టార్‌ను ఈవెంట్‌కు రావాలని కోరారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో,ఫ్యాన్స్ ఈగర్‌గా ఉన్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
A blockbuster start to the year already! #GameChangerTrailer drops on 2.01.2025!❤️🔥😎
— Game Changer (@GameChangerOffl) January 1, 2025
Let The Games Begin 💥❤️🔥#GameChanger #GameChangerOnJanuary10 pic.twitter.com/jvJeemY9Dd