
Game changer: గేమ్ ఛేంజర్' ట్రైలర్ ఆలస్యం.. ఆత్మహత్య చేసుకుంటానన్న అభిమాని
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ట్రైలర్ విడుదల ఆలస్యమైన నేపథ్యంలో, ఒక అభిమాని ఆత్మహత్య చేసుకునేందుకు బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పుష్ప సినిమాకి ఉన్న భారీ క్రేజ్ మెల్లగా తగ్గుతూ, ఇప్పుడు అందరి దృష్టి 'గేమ్ ఛేంజర్' మీదికి వెళ్లింది.
ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ సినిమా ట్రైలర్ విడుదల చేయకపోవడంతో అభిమానుల మధ్య నిరాశ చోటు చేసుకుంది.
ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి మూడు పాటలు, టీజర్ విడుదలైంది.
Details
జనవరి 4న ట్రైలర్..?
ట్రైలర్ ఆలస్యమైనందుకు అభిమాని ఓ సూసైడ్ లెటర్ రాశాడు. ఆ లెటర్లో 'ఈ నెల చివరికి ట్రైలర్ విడుదల చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని" పేర్కొన్నాడు.
ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల, డల్లాస్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ ట్రైలర్ విడుదలకు సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుండటంతో, రామ్ చరణ్ అభిమానుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక, 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ విడుదలకు సంబంధించి కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న లేదా జనవరి 4న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం వస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిమాని రాసిన సూసైడ్ లెటర్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా
— Telugu Scribe (@TeluguScribe) December 28, 2024
గేమ్ ఛేంజర్ టీమ్కు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్#GameChanager #RamCharan𓃵 pic.twitter.com/aHekTA8iCz