Page Loader
Game Changer Trailer: రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ రిలీజ్‌ 

Game Changer Trailer: రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ రిలీజ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని,రాజమౌళి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ను విడుదల చేశారు. రామ్‌ నందన్‌, అప్పన్న పాత్రల్లో రామ్‌ చరణ్‌ అభినయంతో పాటు డైలాగ్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. అంజలి యాక్టింగ్‌ కూడా ముఖ్యంగా ఆకట్టుకుంటుంది. సన్నివేశానికి తగినట్లుగా తమన్‌ అందించిన సంగీతం ఆకర్షణీయంగా ఉంది. "కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు... ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు" వంటి డైలాగులు ప్రేక్షకుల మెప్పును పొందుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ రిలీజ్‌