
GAMA Awards : దుబాయ్‌లో గామా టాలీవుడ్ అవార్డ్స్.. అల్లు అర్జున్‌కు ప్రత్యేక గౌరవం!
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్‌లో ప్రతేడాది అంగరంగ వైభవంగా జరిగే గామా అవార్డ్స్(GAMA Awards) గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది.
వచ్చే ఏడాది మార్చి 3న మరింత వైభవంగా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తామని గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు.
2021, 22, 23 సంవత్సరాల్లో వచ్చిన ఉత్తమ చిత్రాలతో పాటు నటన, దర్శకత్వం, సంగీత విభాగంలో ప్రతిభావంతులకి పురస్కారాలన్ని అందజేయనున్నారు.
దాదాపు 10 బాషలకు చెందిన 10వేల మంది ప్రేక్షకులు ఈ వేడుకలకి హాజరు కానున్నారు.
Details
ఈటీవీలో గామా అవార్డ్స్ ప్రత్యేక్ష ప్రసారం
57ఏళ్ల చరిత్రలో తెలుగు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుకు అందుకున్న అల్లు అర్జున్(Allu Arjun) కి ప్రత్యేకంగా సత్కరించాలని నిర్ణయించినట్లు కేసరి త్రిముర్తులు పేర్కొన్నాడు.
ఈ పురస్కారాల ఎంపిక జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా సంగీత దర్శకులు కోటి, జ్యూరీ సభ్యులుగా శ్రీలేఖ, దర్శకుడు వి.ఎన్.ఆదిత్య వ్యవహరిస్తారు.
ఇక ఈ వేడుక ఈటీవీలో ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు.