Gandhi Tatha Chettu: 'గాంధీ తాత చెట్టు' ట్రైలర్ వచ్చేసింది..ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన మహేష్‌బాబు
ఈ వార్తాకథనం ఏంటి
'పుష్ప 2' చిత్రదర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బాలనటిగా నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'.
ఈ చిత్రాన్ని పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు.
సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, శేష సింధురావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాకు అవార్డులు కూడా లభించాయి.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
వివరాలు
తాతకు ఇష్టమైన చెట్టు..
ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం ప్రముఖ హీరో మహేష్‌బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
"ట్రైలర్ ప్రామిసింగ్‌గా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. సుకృతికి, ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు" అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ చిత్రం గాంధీ సిద్దాంతాలను అనుసరించి, ఓ అమ్మాయి తన ఊరును, తన తాతకు ఇష్టమైన చెట్టును ఎలా కాపాడుకుంటుందో అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహేష్ చేసిన ట్వీట్
Happy to launch the trailer of #GandhiTathaChettu…Looks heartwarming and deeply touching…👏🏻👏🏻 My best wishes to Sukriti and the entire team for their journey ahead. 🤗👍🏻https://t.co/v1Kp8UsjtX#SukritiVeniBandreddi@padmamalladi14 @Thabithasukumar @MythriOfficial…
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2025