తదుపరి వార్తా కథనం

Geetha Madhuri : రెండోసారి తల్లి కానున్న గీతా మాధురి..ఫ్యామిలీ ఫోటో ఇదే
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Dec 12, 2023
06:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సింగర్ గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు సోషల్ మీడియాలో భర్త నందు, కూతురు దాక్షాయనితో పాటు గీత కలిసున్న ఓ ఫోటోను షేర్ చేసింది.
క్యాప్షన్'లో అసలు విషయాన్ని వెల్లడించారు. దాక్షాయని త్వరలోనే అక్క కాబోతోందని గీత రాసుకొచ్చింది.
మరోసారి తాను గర్భం దాల్చినట్లు చెప్పకనే చెప్పింది. 2024 ఫిబ్రవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొంది.
దీంతో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు, సినీఅభిమానులు గీతా మాధురి దంపతులను శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు.
2014లో గీతా మాధురి, నందు ప్రేమ వివాహం చేసుకోగా 2019లో పాప జన్మించగా దాక్షాయని ప్రకృతి అనే పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.