LOADING...
Varanasi : అంతర్జాతీయ వేదికపై 'వారణాసి' గ్రాండ్ ఎంట్రీ.. CCXP 2026లో తొలి ప్రెజెంటేషన్
అంతర్జాతీయ వేదికపై 'వారణాసి' గ్రాండ్ ఎంట్రీ.. CCXP 2026లో తొలి ప్రెజెంటేషన్

Varanasi : అంతర్జాతీయ వేదికపై 'వారణాసి' గ్రాండ్ ఎంట్రీ.. CCXP 2026లో తొలి ప్రెజెంటేషన్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి' (Varanasi) తన తొలి అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 24న మెక్సికోలో నిర్వహించబడనున్న CCXP 2026 కార్యక్రమంలో ఈ సినిమాకు ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ప్రత్యేక 'బిహైండ్ ది సీన్స్' (BTS) వీడియోలను ప్రదర్శించడమే కాకుండా, సినిమా నిర్మాణానికి సంబంధించిన విశేషాలను చిత్ర బృందం అక్కడి ప్రేక్షకులతో పంచుకోనుంది.

వివరాలు

జక్కన్న సినిమాపై భారీ అంచనాలు..

ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ భారీ ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా 'వారణాసి' సినిమా అంతర్జాతీయ ప్రమోషన్‌ను అధికారికంగా ప్రారంభించినట్లవుతుంది. ప్రెజెంటేషన్ అనంతరం చిత్ర బృందం ప్రత్యక్షంగా ప్రేక్షకులతో ముచ్చటించడం ఈ ప్యానెల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారతీయ సంస్కృతి, పురాణాల్ని ప్రపంచ ప్రేక్షకులకు వినూత్నంగా పరిచయం చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వారణాసి ప్రమోషన్స్ ప్రారంభం..

Advertisement