Page Loader
Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు గ్లోబల్ గౌరవం.. హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు
ప్రియాంక చోప్రాకు గ్లోబల్ గౌరవం.. హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు

Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు గ్లోబల్ గౌరవం.. హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌కు గ్లోబల్ రేంజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటైన మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో ప్రియాంక తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుండగా, పాన్ వరల్డ్ స్థాయిలో తన ప్రభావాన్ని మరింత విస్తరించనుంది. ఇంతలో ఆమెకు మరో గ్లోబల్ గౌరవం దక్కింది. ప్రియాంక చోప్రా గోల్డ్ హౌస్ గాలా సంస్థ నుండి అందించే ప్రతిష్టాత్మక గ్లోబల్ వాంగార్డ్ హానర్ అవార్డుకి ఎంపికయ్యారు.

Details

ఈ ఏడాది ఇండియా నుంచి ప్రియాంక ఎంపిక

ఈ అవార్డులు ప్రపంచ స్థాయి స్టార్లు, గ్లోబల్ లీడర్లకు మాత్రమే అందే అరుదైన గౌరవాలు. ఈ అవార్డు ద్వారా ఆమెకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు మరోసారి చాటుతోంది. ఈ అవార్డు ప్రదానోత్సవం మే 10న లాస్ ఏంజెల్స్‌లోని మ్యూజిక్ సెంటర్‌లో జరగనుంది. గోల్డ్ హౌస్ గాలా సంస్థ ఈ నాలుగో వార్షికోత్సవ వేడుకలో ప్రియాంకకు ఈ గౌరవాన్ని అందించనుంది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని 100 మంది అత్యుత్తమ ప్రతిభ కలిగిన యాక్టర్లు, లీడర్లను ఈ సంస్థ ప్రతి ఏడాది గుర్తించి గౌరవిస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి ఈ అవార్డుకు ప్రియాంకనే ఎంపిక కావడం విశేషం.

Details

ప్రియాంకకు శుభాకాంక్షల వెల్లువ

ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్‌లో పలు ప్రముఖ నటులతో కలిసి పనిచేసి గ్లోబల్ స్టార్డమ్ సంపాదించుకుంది. ఆమె క్రేజ్, పనితీరు, వ్యక్తిత్వం ఇవన్నీ కలిసి ఆమెను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ప్రియాంక పలు అంతర్జాతీయ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోనూ తన ముద్ర వేయనున్నారు. ప్రియాంక ఈ అవార్డు ద్వారా భారత నటీమణుల గ్లోబల్ రెకగ్నిషన్‌ను మరో మెట్టు ఎక్కించారు. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.