LOADING...
Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్!
గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్!

Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ సిద్ధమైంది. బాలయ్య ప్రధాన పాత్రలో మరో సారి ఓ పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రకటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 111వ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని తన ఎక్స్‌ (మాజీ ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. 'గాడ్‌ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత మోతెక్కనుంది. బాలయ్యతో మరోసారి కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్‌గా మలిచేందుకు సిద్ధమవుతున్నామంటూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

Details

 రేపు  ఆఖండ 2 టీజర్ రిలీజ్

గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కావడం అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ 2' చిత్రంలో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ 'అఖండ'కి సీక్వెల్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక 'అఖండ 2' టీజర్‌ను కూడా జూన్ 9న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఒకవైపు టీజర్‌ రిలీజ్‌, మరోవైపు కొత్త సినిమా ప్రకటనతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.