Page Loader
Good Bad Ugly: ఓటీటీలోకి 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ 
ఓటీటీలోకి 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌

Good Bad Ugly: ఓటీటీలోకి 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' .. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా యాక్షన్,కామెడీ థ్రిల్లర్‌ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. కథ, నటన, దర్శకత్వం పరంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఆకట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ సినిమా మే 8 నుండి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సినిమాలో అజిత్ సరసన ప్రముఖ నటి త్రిష నటించగా, చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. కథలో అజిత్ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా, యాక్షన్‌తో పాటు హాస్యాన్ని సమపాళ్లలో సమర్పిస్తూ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

వివరాలు 

కథేంటంటే..

ఈ కథకు కేంద్రబిందువుగా నిలిచే పాత్ర ఏకే అలియాస్ 'రెడ్ డ్రాగన్' (అజిత్) ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాఫియా డాన్. ఎన్నో ఏళ్లుగా చీకటి ప్రపంచంలో రాజులా ఏలుతూ వచ్చిన అతను,తన భార్య రమ్య (త్రిష)కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు క్రైమ్ ప్రపంచాన్ని వదిలేసి స్వచ్ఛందంగా జైలుకెళ్తాడు. దాంతో అతను 17 సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత బయటకు వస్తాడు. జైలునుంచి విడుదలైన తర్వాత తన కుమారుడు విహాన్‌ను (కార్తీక్ దేవ్) కలవడానికి, భార్యతో కలిసి స్పెయిన్ వెళ్లాలనుకుంటాడు.

వివరాలు 

కథేంటంటే.. 

అయితే ఈ ప్రయాణంలోనే ఓ గ్యాంగ్‌ అతనిపై హఠాత్తుగా దాడి చేస్తుంది. ఆ దాడిలో నుండి అతను త్రుటిలో తప్పించుకుంటాడు. ఇంతలో స్పెయిన్‌లో ఉన్న అతని కుమారుడిని ఓ ముఠా కిడ్నాప్ చేసి, డ్రగ్స్ కేసులో అకారణంగా జైల్లో పడేస్తుంది. దాంతో ఏకే కుమారుడిని రక్షించేందుకు మరోసారి గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తాల్సి వస్తుందా? తన కొడుకును లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా ఎవరు? వాళ్లకు ఏకేతో ఉన్న పాత కక్ష ఏంటి? తన కుమారుడిని రక్షించేందుకు ఏకే ఏ చర్యలు తీసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా కథ.