Page Loader
Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ శుభవార్త.. అఖండ 2' టీమ్‌ నుంచి స్పెషల్ అప్డేట్!
బాలయ్య ఫ్యాన్స్ శుభవార్త.. అఖండ 2' టీమ్‌ నుంచి స్పెషల్ అప్డేట్!

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ శుభవార్త.. అఖండ 2' టీమ్‌ నుంచి స్పెషల్ అప్డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు 'అఖండ 2: తాండవం'తో మరో బ్లాక్‌బస్టర్‌ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే మేకర్స్ బాలయ్య అభిమానులకు ఓ ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెలాఖరులో ఫస్ట్ లుక్ రివీల్‌ చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

Details

దసరా కానుకగా రిలీజ్

సినిమా విషయానికొస్తే, 'అఖండ'కు సీక్వెల్‌గా స్టార్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో బాలకృష్ణ మరో విభిన్నమైన అవతార్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన రెండు భిన్నమైన పాత్రల్లో అలరించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో పాటు సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎం.తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సంగీతం తమన్ అందిస్తున్నారు.