Loading...
Varanasi Movie: మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌.. 'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్
మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌.. 'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్

Varanasi Movie: మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌.. 'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi)పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్‌' వంటి చిత్రాలతో భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన రాజమౌళి.. ఇప్పుడు మరో భారీ విజువల్‌ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం ఇచ్చిన అప్‌డేట్‌ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.

వివరాలు

'వారణాసి' షూటింగ్‌ పూర్తి.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు

సరిగ్గా ఏడాది క్రితం 'వారణాసి' చిత్రబృందం నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

రాజమౌళి సినిమా కావడంతో ఆ కార్యక్రమంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా మరోసారి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ మూవీ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

'వారణాసి' అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ (CG) పనులతో పాటు రీ-రికార్డింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇంకా డబ్బింగ్‌ పనులు ప్రారంభం కావాల్సి ఉందని చిత్రబృందం తెలిపింది. దీంతో సినిమా నిర్మాణం కీలకమైన పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది.

వివరాలు

అసలైన బ్లాస్ట్‌ ఇంకా ఉందంటూ హింట్‌!

అయితే ఈ అప్‌డేట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం చివర్లో చిత్రబృందం చేసిన వ్యాఖ్యలే. ''ఇది అప్‌డేట్‌ అని మీరు అనుకుంటే ఇది అప్‌డేట్‌. లేదంటే అసలైన బ్లాస్ట్‌ కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిందే'' అనే అర్థం వచ్చేలా పోస్ట్‌లో పేర్కొన్నారు.

దీంతో అభిమానుల్లో కొత్త ఉత్కంఠ మొదలైంది. రాజమౌళి టీమ్‌ ఇవ్వబోయే అసలైన సర్‌ప్రైజ్‌ ఏంటనే చర్చ మొదలైంది.

సినిమా నుంచి మరో భారీ వీడియో లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారా? లేక కథ, పాత్రలకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించనున్నారా? అనే ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా మహేశ్‌బాబు అభిమానులు, రాజమౌళి అభిమానులు ఈ సర్‌ప్రైజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT