
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ న్యూస్ అందింది. 'హరి హర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా పార్ట్ 1ను 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 'మెగా సూర్య ప్రొడక్షన్' ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
అదే విధంగా ఈ సినిమా షూటింగ్ ఇవాళ విజయవాడ లో ప్రారంభమైందని పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవద్దులేకుండా పోయాయి.
ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తుండగా, కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోస్టర్ రిలీజ్ చేసిన మెగా సూర్య ప్రొడక్షన్
"UNSTOPPABLE FORCE, UNBREAKABLE SPIRIT" Storming into cinemas near you on March 28th, 2025! 💥
— Mega Surya Production (@MegaSuryaProd) September 23, 2024
The Warrior Outlaw ~ Powerstar @PawanKalyan garu Joins the Shoot! 💥⚔️#HariHaraVeeraMallu Shoot Resumed Today at 7 AM in a set erected at Vijayawada. 🔥 pic.twitter.com/lNlR04TFka