Loading...
Viswanath and sons movie : 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్'కు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Viswanath and sons movie : 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు మంచి ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద తొలి రోజే మంచి వసూళ్లను రాబట్టింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో కలెక్షన్లు కూడా ఆశాజనకంగా నమోదయ్యాయి. తొలి రోజు వసూళ్ల వివరాలను పరిశీలిస్తే.. శాక్‌నిల్క్ నివేదిక ప్రకారం ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.17.51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నెట్ పరంగా రూ.15.15 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇందులో తమిళనాడు నుంచి అత్యధికంగా రూ.9.15 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు రూ.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

వివరాలు

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సూర్యకు ఉన్న క్రేజ్..

మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సూర్యకు ఉన్న క్రేజ్ కనిపించింది.

విదేశాల్లో కూడా సినిమాకు మంచి స్పందన లభించడంతో అక్కడి నుంచి రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 'విశ్వనాథ్ అండ్ సన్స్' సుమారు రూ.31.51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ జోరు కొనసాగుతోంది.

ముఖ్యంగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి.

పైగా ఇవాళ వీకెండ్ హాలిడే కావడంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది.

డే-2 వసూళ్లు తొలిరోజుతో పోలిస్తే పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT