Gopichand : పీరియాడిక్ డ్రామాతో గోపీచంద్.. చారిత్రక కథతో సరికొత్త ప్రయోగం!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించి, అనంతరం హీరోగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
అయితే కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపీచంద్ ఇప్పుడు సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో తాజాగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనుండగా, గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతుంది.
Details
గ్రాండ్‌గా ప్రారంభమైన చిత్రం
ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమా లాంచ్ కార్యక్రమంలో నటీనటులు, చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామాగా రూపొందించనున్నారని సమాచారం.
7వ శతాబ్దంలో జరిగిన ఓ కీలకమైన చారిత్రక సంఘటన ఆధారంగా కథ సాగుతుందని తెలుస్తోంది. ఇక గోపీచంద్ పాత్ర ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు, రోల్స్ గురించి అధికారికంగా వెల్లడించనున్నారు.