LOADING...
Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి 
దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి

Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే 'క' మూవీతో భారీ విజయం సాధించిన ఆయన, ఇప్పుడు 'దిల్ రూబా' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు విశ్వకరణ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుక్సర్ ధిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. సినిమాపై క్రేజ్ పెంచేలా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ఈవెంట్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా కిరణ్ అబ్బవరం తన ట్విట్టర్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు.

Details

ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్ గిఫ్ట్ 

ఈ వీడియోలో, 'దిల్ రూబా'లో తాను వాడిన బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని కిరణ్ తెలిపారు. 'ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ఈవెంట్లలో తాము చాలా హింట్స్ ఇచ్చామన్నారు. ఆ హింట్స్ ఆధారంగా స్టోరీని కరెక్ట్‌గా గెస్ చేసే వారికి ఈ బైక్‌ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిఫ్ట్‌గా ఇస్తాను. అంతేకాక, విజేతతో కలిసి 'దిల్ రూబా' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వెళ్తాను'' అంటూ ప్రకటించారు. ఈ వీడియో చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జైట్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్‌లో కిరణ్ అబ్బవరం కొత్త తరహా ఆలోచనలు అమలు చేస్తూ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో 'దిల్ రూబా'పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.